యోగాతోని సంపూర్ణ ఆరోగ్యం
నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు యోగ చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం పోస్టర్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 21న నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో నిర్వహించే యోగ దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవనశైలిలో యోగాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు, ఆయుష్, వైద్య ఆరోగ్య విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






