calender_icon.png 21 June, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

21-06-2025 09:36:37 AM

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 

కామారెడ్డి (విజయక్రాంతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) అన్నారు. శనివారం కామారెడ్డి యోగా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని యోగ ఆసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతో మంది పలు రోగాలతో బాధపడుతున్నారని అన్నారు. వాటి నివారణ కోసం క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగ చేయాలని కోరారు. యోగ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, అదనపు రెవెన్యూ కలెక్టర్  విక్టర్, యోగ జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి, యోగా గురువు అంజయ్య గుప్త , సుదర్శన్ గుప్త, సిద్దా గౌడ్, రఘు కుమార్, లక్ష్మీపతి యాదవ్, పెట్టి గాడి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, బిక్కనూర్, తదితర మండల కేంద్రంలోని యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగ ఆసనాలు వేసి యోగ ప్రాముఖ్యతను వివరించారు.