వారంలోగా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
28-05-2024 12:44 AM
జిల్లాలో 188 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్, మే 27 (విజయక్రాంతి) : వారం రోజుల్లోగా జిల్లాలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని, తడిసిన ధాన్యం పై రైతులు అధైర్యపడొద్దని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ భరోసా ఇచ్చారు. సోమ వారం ఆయన రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉందని, ధాన్యా న్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. 188 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని వివరించారు.






