అమెరికాలో యాదాద్రి యువతి మృతి
ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసిన సౌమ్య
ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టిన కారు
యాదగిరిపల్లిలో విషాదం
యాదాద్రి భువనగిరి, మే 27 (విజయక్రాంతి) : ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ యువతి రోడ్డు ప్ర మాదంలో దుర్మరణం చెందింది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె. ఇండియా కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ ప్రమాదం ఆమె తల్లి దండ్రు లను శోకంలో ముంచింది. యాదగిరిపల్లికి చెందిన గుడ్ల కోటేశ్వర్‌రావు, బాలా మణి దంపతుల కూతురు సౌమ్య (24) ఎంఎస్ చదవడానికి 2022 ఆగస్టులో అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లింది. అట్లాంటా యూనివర్సిటీలో ఆరు నెలల క్రితం ఎంఎస్ పూర్తయింది.
అనంతరం ఇండియాకు వచ్చింది. తల్లిదండ్రులతో సరదాగా గడిపి తిరిగి ఉద్యోగం కోసం ఫ్లోరిడాకు వెళ్లిపోయింది. కాగా, ఆదివారం కూరగాయల కోసం కాలినడకన రోడ్డుపై వెళ్తున్న ఆమెను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయాలతో మృతిచెందింది. ఫ్లోరిడా పోలీసులు ఆమె ను గుర్తించి సోమవారం యాదగిరిపల్లిలోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కూతురు ఉద్యోగం చేస్తుంటే చూడాలనే ఆశ తీరకుండానే కనిపించని లోకానికి వెళ్లిపోయిందని తెలిసిన సౌమ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ వార్త తెలి యడంతో గ్రామస్తుల్లోనూ విషాదం అలుముకుంది. కాగా, సౌమ్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సౌమ్య తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.






