17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సార్మత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు

08-02-2026 06:38 PM

* మేడ్చల్ నియోజకవర్గ సీపీఐ పార్టీ ఇంఛార్జ్ తోటపల్లి శంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మేడ్చల్ నియోజకవర్గ సీపీఐ ఇంఛార్జ్ తోటపల్లి శంకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని దళిత సంక్షేమభవన్ లో కాప్రా మండల సీపీఐ కార్యదర్శి దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం దేశవ్యాప్త సమ్మెపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తోటపల్లి శంకర్ హజరై మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణతో ఉద్యోగాలు కోల్పోవడం కార్మికుల హక్కులను హరించడమేనని, కార్పొరేట్ బడాబాబుల కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఉద్యమాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, ప్రజా సంఘాలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నర్సింహాలు, శ్యామల లత. స్వరూప, ఎల్లయ్య, సత్యంసాగర్, మల్లిక, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.