15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పార్టీ ఫిరాయింపులపై న్యాయం ఎక్కడ..

08-02-2026 06:32 PM

ముకరంపుర,(విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాత్రి రాత్రికే పార్టీలు మారిన వారికి టికెట్లు కేటాయిస్తూ గతంలో ఉన్న పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నారు. పార్టీలో సభ్యత్వం లేని వారికి వారి భార్యలకు కూడా టికెట్ కేటాయిస్తున్నార బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కనీస విలువలు పాటించకుండానే టికెట్లు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారిన వారిని పార్టీ ఫిరాయింపుల పేరిట విచారణ ఎదుర్కొంటున్నారని, కానీ కార్పొరేషన్ ఎన్నికలలో సభ్యత్వం పొందకుండానే రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి అడ్డ అడ్డదారులు తొక్కుతున్నారని తెలిపారు. వీటన్నింటిని ఎలక్షన్ కమిషన్ గమనించాలని.. ఇలాంటి వారికి తగిన రీతిలో ఎలక్షన్ కమిషన్ బుద్ధి చెప్పాలని కోరారు.