కోడెల మృతిపై సమగ్ర విచారణ
తప్పిదం తేలితే చర్యలు
వేములవాడ -నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించే కోడె లు, ఆవుల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన రాజన్న ఆలయ గోశాలను సందర్శించి, ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, పశువైద్యులతో చర్చించారు.
చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యా ధులు తదితర కారణాలతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. భక్తులు మొక్కు చెల్లించే సమయంలో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని సూచించారు. గోశాలకు వచ్చే కొత్త కోడెలను 15 రోజులపాటు క్వారైంటైన్‌లో ఉం చాలని, పరిశుభ్రత, దాణా నాణ్యత, ఒకదానిపై మరొకటి దాడులు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు.
కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తానని, అధికారుల నిర్లక్ష్యం తేలితో చర్యలు తప్పవన్నారు. వేములవాడలో ఆధునిక సదుపాయాలతో 40 ఎకరాలలో నూతన గోశాల నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాలతో స్థల సేకరణకు క్యాబినెట్ ఆమోదం లభించిందన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణకు ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల ముందస్తు చర్య లు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన కోడెలనే తేవాలి
రాజన్న సన్నిధిలో కోడె మొక్కు చెల్లించే భక్తులు పసి, అనారోగ్యంతో ఉన్న కోడెలను తీసుకురావద్దని ఆలయ ఈవో రమాదేవి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆలయ గోశాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దూరప్రాంతాల నుంచి కోడెలను తీసుకువస్తుండడంతో అవి అస్వస్థతకు గురవుతున్నాయని, ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. అనారోగ్యంతో ఉన్న కోడెలను ఆలయం బయట వది లి వెళ్లొద్దని, ఆరోగ్యంగా ఉన్న కోడెలనే సమర్పించాలని ఈవో రమాదేవి సూచించారు.






