27 August, 2026 | 3:26 AM

తెలంగాణ ఆహార పరిశ్రమకు ప్రోత్సాహం

27-08-2026 12:51 AM

ఘనంగా హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ 

పురస్కార గ్రహితలకు టీజీటీడీసీ చైర్మన్ రమేష్‌రెడ్డి అభినందనలు 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): హైబిజ్ టీవీ ఫుడ్స్ అవార్డ్స్ 5వ ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని ది డెబ్యూలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నలుగురు ప్రముఖులకు లెజెండ్ అవార్డులు అందజేశారు. వాలెన్సియా నుంచి మనీష్ తురఖియా, పిస్తా హౌస్ నుంచి మహమ్మద్ అబ్దుల్ మజీద్, వసిష్ట శ్రీలక్ష్మి నుంచి కళ్యాణ్ గుమ్మడి, బ్రౌన్ బేర్ నుంచి సోహిల్ లఖాని లెజెండ్ అవార్డులను అందుకున్నారు. అదనంగా, ఆహార పరిశ్రమకు చెందిన 60 మందికి పైగా వివిధ విభాగాల్లో అవార్డులను అందుకున్నారు. అలాగే 12 మంది ప్రముఖ చెఫ్‌లకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. 

ఈ కార్యక్రమానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ వాణి ప్రసాద్, యూత్ అడ్వాన్స్‌మెట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్, ఫ్రీడం ఆయిల్, స్వస్తిక్ స్పైసెస్, మోల్డ్టెక్ సంస్థల ప్రతినిధులు, విజయక్రాంతి సీఈవో రాహుల్ దేవళ్ల హాజరయ్యారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ ఈ గంగాధర్, గౌరవ అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ కార్యక్రమానికి హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజ్ గోపాల్, హైబిజ్ టీవీ ఎల్‌ఎల్‌ఫీ అండ్ హైబిజ్ ఒన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జే సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు.