27 August, 2026 | 1:57 AM

దారి ఇవ్వడం లేదని.. ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

27-08-2026 12:55 AM

గ్రీవెన్స్ సెల్ అధికారులకు ఫిర్యాదు

దారివ్వకుండా కడీలు పాతడంతో మనస్థాపం

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

మహబూబాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): వ్యవసాయ భూమికి దారి ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరెడలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొగిలిచర్ల రామచంద్రయ్య (70) అనే రైతు దిగువ భాగంలో ఉన్న తన వ్యవసాయ భూమిలోకి వెళ్లడానికి మొదట్లో భూమి ఉన్న జక్కుల వీరన్న అనే రైతుతో వివాదం తలెత్తిం ది. దిగువనున్న భూమిలోకి రామచంద్రయ్య వెళ్లడానికి కొంత డబ్బు కూడా వీరన్నకు ఇటీవల చెల్లించాడు.

అయినా కూడా వీరన్న దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఈ అంశంపై ఇటీవల జిల్లా అధికారులకు కూడా రామచంద్రయ్య గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యా దు చేశాడు. అయినా కూడా అతనికి దారి ఇవ్వకపోవడంతో వీరన్న రామచంద్రయ్య డబ్బులను తిరిగి ఇచ్చి, దిగువన ఉన్న భూమిలోకి వెళ్లకుండా వీరన్న దారికి అడ్డుగా కడీలు పాతడంతో ఇక తనకు భూమిలోకి వెళ్లడానికి దారి ఉండదని తీవ్ర మనస్థాపానికి గురయ్యా డు. ఈ నేపథ్యంలో రామచంద్రయ్య చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.