15-11-2025 12:37:52 AM
జిల్లా పతంజలి సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి
మునుగోడు,నవంబర్ 14 (విజయక్రాంతి): ఒక ఎకరం వరి సాగు అయ్యే నీటితో సుమారు 3 ఎకరాలకు వరకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చుని,వరి పైరు సాగుతో పోలిస్తే ఆయిల్ పంప్ తోటలను సాగు చేస్తే రైతులు ఆర్థికంగా బలపడతారని జిల్లా పంతాంజలి సీనియర్ మేనేజర్ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని పలివెల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసి మాట్లాడారు.
ఎకరానికి 57 మొక్కలను నాటుకోవచ్చని ప్రభుత్వం తరపున సబ్సిడీ వస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు ఒక్కసారి నాటితే 4 వ సంవత్సరం నుండి మొదలై 35 సంవత్సరాల పాటు ప్రతి నెల ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ అన్నారు. రానున్న రోజుల్లో దేశ అవసరాలు తీరి రైతులు ఆర్దికంగా బలపడాలి అంటే ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలని కోరారు.
మార్కెట్ సమస్య లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంటుందని అన్నారు. ఆసక్తి ఉన్న రైతులు ముందు వచ్చి ఆయిల్ పామ్ పంటను వేయాలని,ఆయిల్ పామ్ సాగుచేసిన రైతులు చెప్పిన ప్రకారం ఎకరానికి సుమారు 1 లక్ష్మ నుండి 1 లక్షా 50 వేల వరకు నికర ఆదాయం వస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓనిఖిల్ నిఖిల్, సీఈఓ సుఖేందర్, మానిటరింగ్ అధికారి,రేణుక, పతంజలి ఆయిల్ పామ్ ఫీల్ అసిస్టెంట్ పాలకూరి స్వామి,రైతులు ఉన్నారు.