28-12-2025 04:32:51 PM
- CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): 78 సంవత్సరాల స్వాతంత్య్ర భారతావనిలో దేశ భక్తులమని చెబుతూ ఈ దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం ఒకరి సొంతం చేస్తుందని CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్ అన్నారు. సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉన్న హక్కులను, కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు రూపొందించారని, ఈ నిర్ణయాలు కార్మిక వర్గానికి తీవ్ర నష్టదాయకమన్నారు.
CPI వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా జిల్లాలో జనవరి మూడు నుంచి తొమ్మిది వరకు ప్రచార జాతను విజయవంతం చేయాలని, 10న రామకృష్ణాపూర్ లో ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందన్నారు. 18న ఖమ్మంలో శత జయంతి వేడుకల ముగింపు బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ దేశంలో ఎర్రజెండా పార్టీల మధ్య చీలికలు గాని, పార్లమెంట్ లో, రాజ్యసభలో ఎర్రజెండా పార్టీ ల నాయకత్వం లేకపోవటం మతతత్వ రాజకీయాలకు, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మారాయన్నారు. దేశంలో వామపక్ష ఐక్యత కోసం పునరాలోచించుకోవాలని తెలిపారు.