28-12-2025 04:35:03 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పరిధి బోడుప్పల్ సర్కిల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 141వ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అమూల్యమని, ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.