28-12-2025 04:20:34 PM
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగనున్న 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (సుమాయిష్-2026)ను ఉపముఖ్యమంత్రి భట్టి విర్కమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభిస్తారని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఈ నుమాయిష్ ప్రదర్శన కొత్త ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్టాళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, అలాగే శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నుమాయిష్ ప్రవేశ రుసం రూ.50, ఐదేళ్లలోప పిల్లలకు ఉచితంగా ఉంటుందని, నుమాయిష్ లో 1,050 స్టాళ్లు ఉండనున్నాయని మంత్రి మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.