28-12-2025 04:46:24 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో పార్టీ జెండా ఎగరవేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు దాటిన అతి పెద్ద పార్టీ అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును బిజెపి ప్రభుత్వం తొలగించడం అత్యంత దారుణమని ఇప్పటికైనా ఆలోచించి మహాత్మా గాంధీని గౌరవిస్తూ మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీలో కొనసాగించాలని నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ శాఖ తరపున డిమాండ్ చేశారు.