వెంకట్ రాజ్ కుటుంబ సభ్యులకు పరామర్శ
22-06-2026 12:21 AM
మేడ్చల్ అర్బన్ జూన్ 21(విజయక్రాం తి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కిస్టాపూర్ డివిజన్ సమీపంలో గల పూడూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకట్ రాజ్ ముదిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
ఆదివారం వెంకట్ రాజ్ గార్డెన్ లో ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి వర్యులు సర్వే సత్యనారాయణ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నవీన్ చందర్ రెడ్డి.తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ అధికార ప్రతినిధి జి సురేందర్ ముదిరాజ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు..






