22 June, 2026 | 3:00 AM

సాయి గీతాశ్రమంలో ఘనంగా యోగా వేడుకలు

22-06-2026 12:23 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 21 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ మున్సిపల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ సమీపంలోని కండ్లకోయ శ్రీ సాయి గీత ఆశ్రమంలో పూజ్య సద్గురు శ్రీ శ్రీ శ్రీ సాయి కుమార్ ఆధ్వర్యంలో 550- దివ్య వృక్షాల నడుమ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ యోగాచార్యులు శ్రీ శ్రీనివాస్ పుల్లూరి యోగా రంగంలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులు వివిధ యోగా ఆసనాలను నిర్వహించి పాల్గొన్న వారికి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా పూజ్య సద్గురు శ్రీ శ్రీ శ్రీ సాయి కుమార్ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల కలిగే శారీరక,మానసిక,ఆధ్యాత్మిక ప్రయోజనాలను క్లుప్తంగా వివరించారు.అంతే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఎంత తినాలి,ఎలా తినాలి,ఎప్పుడు తినాలి సూపర్ యోగా యొక్క ప్రయోజనాలు నిత్యజీవితంలో ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే మార్గాలపై విలువైన సూచనలు అందించారు. ప్రకృతి మధ్య నిర్వహించిన యోగా మహోత్సవంలో పాల్గొన్న వారందరూ ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

మేడ్చల్ పట్టణంలో.. 

మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలో యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని  ప్రముఖుల పిలుపు మేరకు యోగ సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యోగ సాధన సాధన చేశారు.ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్ లో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ‘ఆరోగ్యం కోసం‘యోగా అనే భావనతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాలు కాలనీల నుండి వందలాది మంది యోగా సాధకులు, మహిళలు, యువత, విద్యార్థులు,వృద్ధులు పాల్గొని యోగా సాధన చేపట్టారు.

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనతో 2015 నుండి జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటామని యోగా శిక్షకులు వెల్లడించారు.గత 12 సంవత్సరాలుగా ప్రపంచంలోని వందలాది దేశాలలో కోట్లాది మంది యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ యోగా విశిష్టతను చాటుతున్నారని ప్రముఖులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు ఎం కిషోర్.మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్.

ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి.మేడ్చల్ మున్సిపల్ సర్కిల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్.ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్.వంశీ విజయ్ వంజరి.ఎల్లంపేట మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు పుష్పారెడ్డి యోగా సాధకులు రాధాకృష్ణ.నారాయణ గౌడ్.జె హరినాథ్. శివశంకర్. నరసింహారెడ్డి. తారక్. విజయ. వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.