04-12-2025 08:57:41 PM
ఎల్బీనగర్: తన పుట్టినరోజు సందర్భంగా అందుబాటులో ఉండనని చెప్పడంతో కొందరు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ కు బహుమతిగా అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఎల్బీనగర్ కో కన్వీనర్ పొట్లపల్లి సాయిరాంగౌడ్, నాయకులు భీమనపల్లి సిద్దు, పారంద సాయి, చంద్రశేఖర్, బందెల సైదులు, ముఖర్జీ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.