04-12-2025 08:50:32 PM
వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు మాజీ సర్పంచ్ యాలం సరస్వతి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ రాజు కాకర్లపూడి కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం ఆమెతోపాటు 20 కుటుంబాల ప్రజలు చేరారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పేరూరు మాజీ సర్పంచ్ యాలం సరస్వతికి దంతులూరి విశ్వనాథ ప్రసాద్ రాజు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన సరస్వతి కుటుంబానికి అన్నివేళల కాంగ్రెస్ పార్టీ అండదండలుగా నిలుస్తుందని పేరూరు పంచాయతీ కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి మెలిసి అందరిని కలుపుకొని పోయి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లె వెంకన్న నల్లగా రమేష్ కురుసం కృష్ణమూర్తి ఆనందరావు బొల్లె నరేష్ గార రాంబాబు తోటపల్లి ఎల్లయ్య కోరం పగిడయ్య అరికిల్ల రఘుపతి అరికెల చిన్న సమ్మయ్య తల్లడి శ్రీకాంత్ నవీన్ యాదవ్ ఎర్రావుల నరేష్ తూనూరు జయస్ తదితరులు పాల్గొన్నారు.