04-12-2025 08:32:28 PM
నంగునూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు సిద్దిపేట ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజగోపాల్ పేట ఎస్సై టి.వివేక్ నవంబర్ 29 న నంగునూరు మండలం మాగ్డంపూర్ గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో నాగరాజుపల్లికి చెందిన జక్కిరెడ్డి భూపాల్ రెడ్డి (34) మద్యం తాగి ట్రాక్టర్ నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం భూపాల్ రెడ్డి నీ సిద్దిపేట స్పెషల్ జుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం అతనికి రూ.10,500 జరిమానాతో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం, తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.