04-12-2025 08:42:35 PM
కొప్పుల పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జీడిపల్లి శోభ, నర్సింహా రెడ్డి
చేగుంట/మసాయి పెట్ (విజయక్రాంతి): తనను గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కొప్పుల పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జీడిపల్లి శోభ, నర్సింహారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా మసాయి పెట్ మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన జీడిపల్లి శోభ బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతు దారులతో కలిసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ గౌడ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.