calender_icon.png 4 December, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి

04-12-2025 08:35:49 PM

చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్..

చిట్యాల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల రిత్యా ప్రతి ఒక్కరూ ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. గురువారం చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  గ్రామస్థులకు ఎన్నికలకు సంబంధించిన ముఖ్య సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలని, ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా సామరస్యం పాటించాలన్నారు. చట్ట వ్యతిరేక విధానాలను  అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.