calender_icon.png 4 December, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ కళాకారుల ప్రత్యేక కమిటీపై ప్రజా ప్రభుత్వానికి విజ్ఞప్తి

04-12-2025 08:56:31 PM

ఉద్యమ కళాకారుల రాష్ట్ర కన్వీనర్: యెల్ల పోశెట్టి

వేములవాడ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కళాకారులను గుర్తించేందుకు డిసెంబర్ 9 లోపు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమ కళాకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్, కళాతపస్వి యెల్ల పోశెట్టి ప్రజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రజా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న హైదరాబాద్ ఆల్వాల్ చౌరస్తా జయశంకర్ సార్ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుత దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమానికి మద్దతిచ్చిన వారందరికీ ఉత్తర తెలంగాణ కో-ఆర్డినేటర్ బొడ్డు రాములు కృతజ్ఞతలు తెలిపారు.