calender_icon.png 4 December, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రద్ధగా విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలి

04-12-2025 08:48:43 PM

విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ 

ఎంపీడీవో తహెరా బేగం

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో వసతి గృహంలో బీసీ బాలికల, బీసీ బాలుర వసతి గృహాలలో ఉలేను దుప్పట్ల పంపిణీ చేసినట్లు వసతి గృహ నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున వసతి గృహంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో తహెరా బేగం ఎంపిఓ ప్రకాష్ ఆధ్వర్యంలో బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్న 53 మంది విద్యార్థులకు బిసి బాలికల వసతి గృహంలో 140 మంది బాలికలకు ఊలేన్ దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో తాహెరా బేగం తెలిపారు.

అనంతరం ఆమె, వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యను ప్రతిష్టాత్మకంగా అందిస్తుందని విద్యార్థులకు చలికాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు దుప్పట్లతోపాటు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య చదువుకోవడానికి సరిపడు పుస్తకాలు అన్ని ఉచితంగా పంపిణీ చేస్తుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్ బీసీ బాలుర వసతి గహ నిర్వాహకులు సాయిరెడ్డి, బీసీ బాలికల వసతి గృహ నిర్వాహకురాలు విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.