calender_icon.png 4 December, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృత్రిమ కాలు ఏర్పాటుకు ఆర్థిక సహాయం..

04-12-2025 08:45:02 PM

అభిమానికి అండగా కంచర్ల బ్రదర్స్..

చిట్యాల (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకొని పూర్తి వికలాంగునిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కంచర్ల బ్రదర్స్ అభిమానికి జరిగిన విషయం తెలుసుకొని అతనికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం చేసి తమ మానవత దృక్పతాన్ని మరోసారి చాటుకున్నారు కంచర్ల బ్రదర్స్. చిట్యాల పట్టణానికి చెందిన పాల భిక్షం రోడ్డు ప్రమాదంలో తన కాలును  పూర్తిగా వైద్యులు తొలగించారు.

దీంతో వికలాంగుడిగా ఇంట్లోనే ఉంటున్న విషయాన్ని కంచర్ల బ్రదర్స్ తెలుసుకుని జపాన్ టెక్నాలజీ తో తయారు చేసిన కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు అయ్యే లక్ష 25 వేల రూపాయలను ఆర్థిక సాయం చేసి తమ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గురువారం కృత్రిమ కాలు ఏర్పాటు చేయడంతో పాల భిక్షం నడవడం ప్రారంభించాడు. దీంతో ఎంతో సంతోషించిన పాలభిక్షం అతని కుటుంబ సభ్యులు కంచర్ల బ్రదర్స్ ను నమ్ముకుని ఉన్న తనకు ఎంతో సాయం చేశారని వారికి రుణపడి ఉంటానని  అన్నారు. ఈ సందర్భంగా కంచర్ల కృష్ణారెడ్డి పాల బిక్షమును కలిసి ధైర్యంగా ఉండమని తనకు ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి కూడా ఉన్నాడు.