04-12-2025 08:46:43 PM
సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు
కామారెడ్డి జిల్లా కనకల్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల కోసం ఎర వేస్తున్నారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మైలారం రవీందర్ రెడ్డి ఇత్తడి బిందెలు పంచుతూ ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఎఫ్ ఎస్ టి ఇంచార్జ్ కోల రాజేశ్వర్ తాడ్వాయి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారించగా ఓటర్లకు పంచేందుకు 41 ఇత్తడి బిందెలు లభించినట్లు వాటిని పోలీసులు తెలిపారు. ఎస్సై నరేష్ మాట్లాడుతూ ఎఫ్ ఎస్ టి ఇంచార్జ్ రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు గ్రామానికి వెళ్లి విచారించగా ఓటర్ల కోసం ఇత్తడి బిందెలు పంపిణీ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థి రవీందర్ రెడ్డి తెచ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
వాటిని స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ ఎవరైనా. హలో బాలకు గురి చేస్తే ఆ పరిణామాలు ఐదు సంవత్సరాలు భరించాల్సి ఉంటుందని ఓటర్ల కు ఆయన విజ్ఞప్తి చేశారు. క్వాటర్ సీసాలకు, డబ్బులకు, విలువైన వస్తువులకు ఓటును అమ్ముకోవద్దని కోరారు. ఓటు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధం అని దాన్ని వివేకంతో ఉపయోగించాలని హితవ్ పలికారు. ఎవరైనా సరే హోటల్ గురి చేసే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. గ్రామాలలో ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు చర్యలు చేపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్ర లోభాలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి రవీందర్ రెడ్డి పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని ఎస్ఐ నరేష్ కోరారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో సర్పంచ్ అభ్యర్థులు ఓర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మద్యం తో విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరు తమ గుర్తుకు సంబంధించిన బహుమతులను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకరి కంటే పై ఒకరు పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పోటీ పడుతున్నారు. మరికొందరు అభ్యర్థులు నేరుగా వెళ్లకుండా తమ అనుచరుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మారం చేస్తున్నారు.