25-08-2025 02:08:19 AM
హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ అధ్యక్షుడిగా మొగుళ్ల రాజిరెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 24(విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాట ర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేందుకు, మెరుగైన పని పరిస్థితులను కల్పించడానికి, కార్మి కుల సేవలను సమర్థవంతంగా అందించేందుకు యాజమాన్యంతో సమన్వయంగా పనిచేయడానికి కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ గొడుగు కింద పని చేయాలనీ నిర్ణయించామని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ట్రేడ్ యూనియన్స్ జాయిం ట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా మొగుళ్ల రాజిరెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ ఉద్యో గ, కార్మికులు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ట్రేడ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి ఐఎన్‌టీయూసీ బ్యానర్ కింద ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. హై దరాబాద్ నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ అనుబంధ జలమండలి కార్మిక సంఘాల సమావేశంలో శ్రామిక శక్తి సమిష్టి ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి ట్రేడ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడి గా మొగుళ్ల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా టి.పి.రాఘవేంద్ర రాజ్, ఎ.శ్రా వణ్ కుమార్, మొహమ్మద్ జహంగీర్, బి.దే వేందర్, చంద్రశేఖర్, సయ్యద్ అక్తర్ అలీ, బి.నర్సింగ్ రావు, ఎం.రాజా, బి.జైరాజ్, సురే ష్ బాబు, కె.రామరాజు, బి.భూమయ్యలను ఎన్నుకున్నారు. ఐఎన్.టి.యు.సి నాయకత్వంలో అనుబంధ సంఘాలన్నీ ఐక్యత, పా రదర్శకత, నిబద్ధతతో పనిచేయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ సందర్బంగా మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ జలమండలి గుర్తింపు సంఘమైన బిఆర్‌ఎస్ అనుబంధ బిఆర్ టియు నేతల చేతకాని తనం వల్ల ఓవర్ టైమ్ చేసిన కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అదనంగా పనిచేసిన కార్మికులకు ఓవర్ టైమ్ (ఓటి) అలవెన్స్ చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జలమండలి ఎండి దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.