25-08-2025 02:09:59 AM
-అనుమానంతో భర్త ఘాతుకం
-విహారయాత్రకు తీసుకెళ్లి హత్య
-నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన
నాగర్‌కర్నూల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రేమించి పెళ్లాడిన భార్యపై అను మానం పెంచుకున్న భర్త విహారయాత్రకు అని నమ్మించి తీసుకెళ్లి.. పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన ఆరెకంటి శ్రీశైలం(30), మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రావణి(27) తో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇరువురి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు రావడంతో శ్రావణి తన పిల్లలతో పాటు మహబూబ్‌నగర్‌లోనే నివాసం ఉం టుంది. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీశైలనం ఆమెను హతమార్చాలని పథకం వేసుకున్నాడు. ఈ నెల 21న కొల్లాపూర్ మం డలం సోమశిల విహారయాత్రకు వెళ్దామని చెప్పి ఒప్పించి, బైకుపై మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ వైపు బయలుదేరారు.
పెద్దకొత్తపల్లి మండ లం మారేడు మను దిన్నే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం రాగానే పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి భార్యను హతమా ర్చాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రో ల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టాడు. కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో శ్రావణి తండ్రి శ్రీను మహబూ బ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. రం గంలోకి దిగిన పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చిం ది. స్థానిక పోలీసుల సహకారంతో మహబూబ్‌గర్ పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.