27-11-2025 12:26:19 AM
-స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బుద్ది చెప్పాలి
-బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు, నవంబర్ 26 (విజయక్రాం తి): బీసీలను కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిం దని, 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కొన్ని మండలాల్లో ఒక్క సీటు కూడ బీసీ కేటగిరి వారికి కల్పించలేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. గతంలో ఉన్న 22% పాత రిజర్వేషన్లు సైతం తగ్గించడం సిగ్గుచేటని అన్నారు. మండలంలోని సుంకిడి గ్రామ అయ్యప్ప స్వామి ఆలయాన్ని బుధవా రం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ప్రేమ లేదని కేవలం రాజకీయ పబ్బం గడపడానికే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికారని అన్నారు. బీసీలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, అబ్దుల్లా, మగ్గిడి ప్రకాష్, తోట శ్రీనివాస్, వామన్, గజానాన్, రమేష్, లక్ష్మణ్, రాంకిషన్, నర్సింగ్ తదితరులు ఉన్నారు.