27-11-2025 12:26:18 AM
దోపిడీ దొంగలని వివిధ వెబ్ సైట్లలో ప్రచారం
పాపన్నపేట, నవంబర్ 26 :పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మే రకు మెదక్ స్పెషల్ పోలీసు లు దాడి చేసిన సంఘటన మం గళవారం రాత్రి ఏడుపాయల్లోని హీరాలాల్ షెడ్డులో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సత్రమైన హీరాలాల్ షెడ్డులో పే కాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసులు దాడి చేయగా పేకాట రాయుళ్ళు పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై దాడి చేసేందుకు ఉపక్రమించేందుకు ప్రయత్నం చేయడంతో అనుకొని సంఘటనను గుర్తించిన పోలీసు ఉన్నత అధికారి తన వెంట ఉన్న రివాల్వర్ చూపించడంతో భయపడిన పేకాట రాయుళ్ళు వెనుకంజ వేశారు.
దీంతో కుటుంబీకులు తాము విందులో పాల్గొనేందుకు వచ్చామని, తమ కుటుంబ సభ్యులను వదిలి పెట్టాలని వేడుకోవడంతో పోలీసులు మానవతా దృక్పథంతో వదిలి పెట్టినట్లు ఉన్నత అధికారి పేర్కొన్నారు. ఈ విషయమై రివాల్వర్ తో దోపిడీ దొంగలు అని బుదవారం వివిధ వెబ్ సైట్ లలో ప్రచారం కావడం విస్మయానికి గురిచేసిందని, దాడి చేసింది దొంగలు కాదు పోలీసులని వెల్లడించారు.