calender_icon.png 27 November, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన రష్యన్ ప్రొఫెసర్లు

27-11-2025 12:27:23 AM

గజ్వేల్, నంబర్ 26 : గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోనీ గజ్వేల్ చేనేత సహకార సంఘంను బుధవారం రష్యన్ ప్రొఫెసర్లు ఆండ్రీ,లుపా,అలీనా సందర్శించారు. చేనేత సహకార సంఘంలో చేనేత మగ్గాలను పరిశీలించి పనితీరును, నేతల ఉపాధిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు బోల్లిబత్తుల దేవదాస్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి చేనేత వస్త్రాలు ఎంతో దోహదపడతాయన్నారు.

సమాజంలో పద్మశాలీల గొప్పతనం ఎనలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడెపు బాలచంద్రం, నాయకులు పురుషోత్తం, రామరాజు, కృష్ణమూర్తి ఆంజనేయులు పూల సత్యము శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనుప్,

సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కోట కిషోర్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లంరాజు కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్ , ప్రేమ్ కుమార్ , కార్యదర్శి హనుమాన్ల నాగరాజు నేత, కోశాధికారి గుండు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారు సత్యసాయి మందిరాన్ని సందర్శించారు.