25-08-2025 01:35:16 AM
కరీంనగర్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లి స్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు నివాళులర్పించారు.
అనంతరం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి ప్రారంభం మైన జనహిత రెండో విడత పాదయాత్ర లో పాల్గొన్నారు. పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. సేవాదళ్ ఆధ్వర్యంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. పాదయాత్ర ప్రాంగణం జన సందోహంతో కిక్కిరిసిపోయింది పాదయాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలుపాల్గొన్నారు.