calender_icon.png 25 August, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు ఆటోలు.. ఇటు ద్విచక్ర వాహనాలు

25-08-2025 01:33:48 AM

- రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు

- పట్టించుకోని అధికారులు..

- తూతూ మంత్రపు మందలింపులు 

టేకులపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): అటు ఆటోలు.. ఇటు ద్విచక్ర వాహనాలు.. నిత్యం - రద్దీగా ఉండే రహదారిలో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో వా హనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రో డ్డు సెంటర్ లోని దుస్థితి. ఇల్లందు - కొత్తగూడెం హైవే ప్రధాన రహదారిలో టేకుల పల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు కూడలి నిత్యం రద్దీ ప్రాంతం. ఇక్కడి నుంచే సింగరేణి కోయగూడెం ఉపరితల గని నుం చి బొగ్గు రవాణా వందలాది లారీలతో నడుస్తుంది.

ఉన్న రహదారి వెడల్పుగా ఉన్న ఒక వైపు దుకాణ దారులు రోడ్డు పైకే వచ్చి వ్యాపారాలు చేయడం, అక్కడే కొనుగోలుకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ చేయడం తో రోడ్డంతా ముసుకు పోతుంది. మరో వై పు ఆటోలు వరుసలో కట్టి అడ్డంగా పెట్టడం తో వచ్చే వాహనాలకు కాకుండా రహదారి వెంట నడిచే వ్యక్తులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. పంచాయతీ అధికారులు, పోలీసు లు అప్పుడప్పుడు ర హదారి ఆక్రమించిన వారికీ నోటీసులు ఇ చ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శా శ్వత పరిస్కారం ఆ పాపాన పోవడం లేదు.

పార్కింగ్ స్థలం లేక ఉన్న స్థలంలో వాహనాలు పెడితే పోలీసులొచ్చి ఫోటోలు తీస్తూ జరిమానాలు విధిస్తున్నారని వాహనదారులు లబోదిబో అంటున్నారు. రోడ్డు ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై అప్పుడప్పుడు పెట్టీ కేసులు పెడుతున్నారు తప్ప పరిస్కారం లేదనే చెప్పొచ్చు. ఒకటి రెండు రోజు లు రోడ్డుకు దూరంగా పెట్టినట్లు పెట్టి మల్లి రహదారికి అడ్డంగా వస్తువులు పెడుతుండటంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఇదే ప్రాం తంలో రద్దుకు గుంతలు ఏర్పడి ప్రమాద భ రితంగా తయారవ్వడం మరింత ఇబ్బంది ఏ ర్పడుతుంది. కొందరైతే తమ దుకాణాల ముందు ప్రభుత్వ స్థలాన్ని కూడా అద్దెకి ఇ చ్చి సొమ్ము చేసుకుంటున్నారు. బోడు రోడ్డు కూడలిలో రవాణా ఇబ్బందులతో పాటు, వాహనాల పార్కింగ్ కు చర్య లు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. మరోవైపు ఆటోలు రహదారిపై విచ్చలవిడిగా పెట్టి మ రింత ఇబ్బంది కలిగిస్తున్నారు. మూల మలుపులో అడ్డంగా పెట్టి హారన్ కొట్టిన తొలిగే పరిస్థితి లేకుండా పోయింది. పంచాయతీ, పోలీసు అధికారులు చొరవ తీసుకొని ఇబ్బందుల్ని తొలగించాలని ప్రజ లు కోరుతున్నారు.