25-08-2025 01:36:48 AM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి, గితే,
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 24(విజయక్రాంతి)వేములవాడ భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్న నేప థ్యంలో భీమేశ్వర ఆలయంలో కల్యాణ మండపం, హోమ, వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులు చేపట్టడం జరుగుతున్నది భక్తులకు దర్శనం కోసం చేస్తున్న పనుల పై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఆదివారం కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గెస్ట్ హౌస్ లో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంతకుముందు రాజన్న దర్శ నం చేసుకోగా, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని విప్, కలెక్టర్, ఎస్పీ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం విప్ మాట్లాడారు. సమ్మక్క సారక్క జాతర వస్తున్న నేపథ్యంలో రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పనులలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ రాధాభాయ్, తదితరులు పాల్గొన్నారు.