calender_icon.png 16 November, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశావాహులలో ఉత్కంఠత!

16-11-2025 11:30:57 AM

ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ లో జోష్

వలిగొండ,(విజయక్రాంతి): ఈనెల 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశావాహులలో ఉత్కంఠత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు గత రెండు సంవత్సరాల నుండి వాయిదా పడుతుండడంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రతిసారి నిరుత్సాహ పడిపోతూ వస్తున్నారు.

అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆశావాహలలో ఉత్కంఠత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలలో మొదట సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.