16-11-2025 10:10:34 AM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈనెల 10వ తేదీన జరిగిన కారు పేలుడు స్థలంలో 9 ఎంఎం సైజులో ఉన్న మూడు బుల్లెట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు గురించి తెలిసిన అధికారుల ప్రకారం, రెండు గుళికలు ప్రత్యక్ష గుండ్లు కాగా, మూడవది ఖాళీ షెల్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 9 ఎంఎం మందుగుండు సామగ్రిని సాధారణంగా భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది ఉపయోగిస్తారు. అయితే, ఆ ప్రదేశంలో ఎటువంటి పిస్టల్ గాని, ఆయుధ భాగం కనుగొనబడలేదని అధికారులు తెలిపారు.
దీంతో ఆ బుల్లెట్లను అక్కడ ఎలా పడ్డాయనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఎర్రకోట సమీపంలో ఉన్న తమ సిబ్బందికి జారీ చేసిన బుల్లెట్లను పోలీసులు పరిశీలించారు. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాన అనుమానితుడు డాక్టర్ ఉమర్ నబీ నడిపిన హ్యుందాయ్ ఐ20 కారు కదలికను గుర్తించే 43 సీసీటీవీ పూటేజ్ మరోసారి పరిశీలించారు. పేలుడు జరిగిన ప్రదేశం నుండి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా అతని తల్లి నుండి తీసుకున్న నమూనాలతో సరిపోలిన తర్వాతే ఉమర్‌ను దాడితో సంబందం ఉందని అధికారులు అధికారికంగా గుర్తించారు.