16-11-2025 11:34:22 AM
- ఇషా ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వాకం
- ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి అనుబంధ గ్రామమైన మనోరమబాద్ కు చెందిన హనుమన్ల పెంటయ్య (55) వృత్తి: సెంట్రింగ్ లేబర్. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం వచ్చిన ఆయన, మంచాల రోడ్డులో వెళుతుండగా కోళ్ల డిసిఎం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ఇషా హాస్పిటల్ లో చేర్పించారు. సరైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, అందులో ఉన్న కిందిస్థాయి సిబ్బంది చికిత్స అందించడంతో అస్వస్థతకు గురై అతను మృతి చెందాడు. వైద్యం వికటించడంతోననే మృతి చెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు, మున్నీరవుతున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.