calender_icon.png 16 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక అభివృద్ధివైపు ప్రస్థానం!

16-11-2025 01:06:33 AM

 ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం, అంతా అక్కడే మకాంవేయడం పరిపాటిగా మారుతున్నది. దీంతో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ కుంటుపడు తున్నది. అందరి ఫోకస్ ఉప ఎన్నికలపైనే ఉండటం సాధారణమైంది. ఈ రకమైన వైఖరి మంచిది కాదు. అన్ని ప్రధాన పార్టీల లక్ష్యం భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే అని స్పష్టమైన నేపథ్యంలో.. వారి వారి పాత్రలను సమర్థవంతం గా పోషించాలని, తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మం చి జరగాలని కోరుకుందాం. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక విధంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను మరో సారి ప్రజల ముందుంచిన సందర్భంగా చూ డాలి. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో, ఏం చేయాలనుకుంటుందో వివరించింది. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా సమ స్యలపై గళమెత్తి బాధిత వర్గాల ప్రక్షాన పోరా టం చేస్తామని మాటిచ్చింది. బీజేపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి చేసిన మేలు వివరించే ప్ర యత్నం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ముగిసింది.గత నెలరోజులుగా ఆయా పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం కొనసాగింది.

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొందిన ఫలితం కొందరికి ఆనందాన్ని ఇస్తే, మరికొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి అన్యూహ పరిణామాల్లో తప్పితే ఎక్కడైనా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది.జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంపై దృష్టి సారించగా, బీఆర్‌ఎస్ పార్టీ.. అధికార పార్టీ ఇచ్చిన హామీలు, విస్మరించిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. బీజేపీ ఎప్పటిలాగానే హిందూత్వ మంత్రాన్ని నమ్ముకుని బరిలో దిగింది.

అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశంగానో, ఇక్కడి ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని, లేక తిరస్కరించారని ఆలోచించాల్సిన అవసరం లేదు.నిజానికి భవిష్యత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఒక సెమీ ఫైనల్ ఫైట్ లాగా ఆయా పార్టీలు భావించాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల భవిష్యత్ కార్యాచరణ, వైఖరి ఎలా ఉండబోతోందనే అంశం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఫైనల్ ఫైట్‌గా భావించే 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీలు ఏవిధంగా రంగం సిద్ధం చేసుకోవాలో తాజా ఉప ఎన్నికల ఫలితం స్పష్టతను ఇచ్చింది. 

చేసింది, చేసేది చెప్తున్న కాంగ్రెస్...

తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారం కోసం బీఆర్‌ఎస్, కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేసినా.. నెరవేర్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవకాశం లభించలేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కారణంగానో ప్రజలు కాంగ్రెస్ చేతికి పాలన పగ్గాలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది.రాష్ట్ర ప్రగతి కోసం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలను జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ మరోసారి వెల్లడించింది.

2034 వరకు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేయడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేయదలచుకున్న కార్యాచరణను కూడా ప్రజలకు వివరించింది. ప్రస్తుతం ఈ ఫార్ములాతో జూబ్లీహిల్స్‌లో విజయం సాధించి, జోష్ మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నది. 

ప్రత్యామ్నాయం దిశగా బీఆర్‌ఎస్... 

రాష్ట్రంలో తొలి పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ పార్టీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి వచ్చింది. అయితే ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష స్థానానికి బీఆర్‌ఎస్ పార్టీ సమర్థవంతంగా న్యాయంచేస్తున్నదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది. హామీ ఇచ్చి విస్మరించిన అంశాలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ప్రజలకు వివరిస్తున్నది. అంశాల వారీగా స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నది. అయితే అనూహ్య పరిణామాల కారణంగా సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌ను నిలుపుకోలేక పోయింది. అయితే జూబ్లీహిల్స్‌లో ఓటమిని సానుకూలంగా మార్చుకునే దిశగా బీఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తున్నది.

ప్రస్తుత ప్రతిపక్షం స్థానం నుంచి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కావాలని చూస్తోంది. తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని బలంగా విశ్వసిస్తున్నారని చెబుతున్నది. ఈ క్రమంలోనే భవిష్యత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నది. అయితే సెమీ ఫైనల్స్ లాగా భావించినప్పటికీ, జూబ్లీహిల్స్‌లో ఓటమితో.. అసెంబ్లీ ఎన్నికల వరకు తమకు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి విజయం సాధించాలని యోచిస్తున్నది.

నమ్మిన సిద్ధాంతంతో బీజేపీ..

కేంద్ర ప్రభుత్వంలో, దేశంలోనే మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విజయానికి కారణమైన ప్రధాన అంశం మతం ఆధారిత రాజకీయం. ఆ పార్టీ తెలంగాణలో నే అదే వైఖరిని అవలంభిస్తున్నది. రోజురోజుకు ప్రజలనుంచి మద్దతు కూడగట్టు కుం టుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ లు గెలుచుకోవడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. అయితే తెలంగాణలోని భిన్నమైన రాజకీయ నేపథ్యంలో.. రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి కొంతమేర కష్టతరమవుతున్నది.

బీజేపీపై ఉన్న విశ్వసనీయత కేవలం పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే పరిమితమవుతుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువుచేశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ దక్కించుకున్న బీజేపీ ప్రస్తుతం డిపాజిట్ కూడా కోల్పోయింది. తెలంగాణ నుంచి ఉన్న 8 మంది ఎంపీల్లో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులను కట్టబెట్టి రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తున్నామని బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది.

కేంద్రం వాటా కింద తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నామని వివరిస్తు న్నది. కానీ తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకులు చెబుతున్న లెక్కలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ నేపథ్యం, బీజేపీ మతం ఆధారిత సిద్ధాంతాన్ని మధ్య ఉన్న వైరుధ్యమే దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తుంది. అయితే అటు కాం గ్రెస్, బీఆర్‌ఎస్‌లకు దక్కినట్టుగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు రాష్ట్రంలో అధికారం దక్కుతుందని ఆ పార్టీ విశ్వసిస్తుంది. ‘అందరికీ ఇచ్చారు అధికారం.. మాకు ఇస్తా రు అవకాశం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నది. కానీ బీజేపీ నమ్ముకున్న సిద్ధాంతం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందో వేచి చూడాలి. 

ఇక ముందూ చేయాలి... 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక విధంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను మరోసారి ప్రజల ముందుంచిన సందర్భంగా చూడాలి. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో, ఏం చేయాలనుకుంటుం దో వివరించింది. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై గళమెత్తి బాధిత వర్గాల ప్రక్షాన పోరా టం చేస్తామని మాటిచ్చింది.

బీజేపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి చేసిన మేలు వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ పరిస్థితులు కేవలం ఈ ఉప ఎన్నికల వరకే పరిమితం కాకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో అంశాల ఆధారం గా, సమస్యల పరిష్కారం కోసం ఆయా పార్టీలు వారి బాధ్యతను నిర్వర్తించాలి.

అప్పు డే రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనించేందుకు ఆయా పార్టీలు దోహదపడినట్లు అవు తుంది. అయితే ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అటు అధికారి పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం, మంత్రులు, ఇతర నాయకులందరూ అక్కడే మకాంవేయడం పరిపాటిగా మారుతున్నది. దీంతో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ కుంటుపడుతున్నది. అందరి ఫోకస్ ఉప ఎన్నికలపైనే ఉండ టం సాధారణమైంది. ఈ రకమైన వైఖరి మంచిదికాదు. అన్ని ప్రధాన పార్టీల లక్ష్యం భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే అని స్పష్టమైన నేపథ్యంలో.. వారి వారి పాత్రలను సమర్థవంతంగా పోషించాలని, తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుందాం. 

తెలంగాణలోని భిన్నమైన రాజకీయ నేపథ్యంలో.. రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి కొంతమేర కష్టతరమవుతున్నది. బీజేపీపై ఉన్న విశ్వసనీయత కేవలం పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే పరిమితమవుతుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.