calender_icon.png 16 November, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీలో కలియతిరిగి.. సమస్యలు తెలుసుకుని..

16-11-2025 09:31:47 AM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మార్నింగ్ వాక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ప్రతి కాలనీలో కలియ తిరిగి ఇంటింటికి సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమయ్యారు. ఉదయాన్నే తమ కాలనీలో ఎమ్మెల్యే కనబడడంతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురై ఆనందపడ్డారు. తమ కాలనీలలో ఉన్న మురికి నీరు వ్యవస్థ, మిషన్ భగీరథ మంచినీటి అవస్థలను, రోడ్ల పరిస్థితులను స్థానికులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. వాటిని రాసుకున్న ఎమ్మెల్యే వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, జన్నారపు శంకర్, తదితరులు ఉన్నారు.