calender_icon.png 16 November, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్‌లో కాల్పులు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి

16-11-2025 12:41:30 PM

ఫిరోజ్‌పూర్: పంజాబ్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కాల్చి చంపిన సంఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే... ఫిరోజ్‌పూర్‌లోని బుధ్వారా వాలా సమీపంలో ఉన్న నవీన్ ఆరోరా(32) అనే వ్యక్తి శనివారం సాయంత్రం నవీన్ తన దుకాణం నుండి డాక్టర్ సాధు చంద్ చౌక్ సమీపంలో ఉన్న తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చిన కాల్చి చంపారు. దీంతో నవీన్ అక్కడిక్కకడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలసులు, ఫిరోజ్‌పూర్‌ ఎస్ఎస్పీ భూపిందర్ సిగ్, ఎమ్మెల్యే రణ్బీర్ సింగ్ భూ్లార్ సైతం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నింధింతులను గుర్తించేందుక సీసీటీవీ పుటేజ్ లను పరిశీలించారు. మృదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు నవీన్ ఆరోరా తాతా దివంగత దీనానాథ్ ఫిరోజ్‌పూర్‌ నగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గ పనిచేశారు. ప్రస్తుతం మృతుడు కూడా ఆర్ఎస్ఎస్ లో కీలక బాధ్యతలో కొనసాగుతున్నారు. ఆయనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు మృతుని తండ్రి తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లిడించారు. నిందితులను విలైనంత త్వరగా పట్టుకుంటాని పోలీసులు హమీ ఇచ్చారు.