12-12-2025 12:27:14 AM
భద్రాచలం, డిసెంబర్ 11, (విజయ క్రాంతి): భద్రాచలం నియోజకవర్గం లోని భ ద్రాచలం ఒక గ్రామ పంచాయతీ, దుమ్ముగూడెం మండలంలో 37 గ్రామపంచాయతీలు, చర్ల మండలంలో 26 గ్రామపంచాయతీలు మొత్తం 64 గ్రామపంచాయతీలు ఉం డగా అందులో మెజారిటీ గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ తో పాటు సిపిఐ పార్టీ కలిసి పోటీ చేయడంతో దాదాపుగా 80 శాతం సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు.
వీరితో పాటు టిఆర్‌ఎస్ సిపిఎం సర్పంచులు కూ డా అక్కడక్కడా గెలుపొందారు.చర్ల మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా అందిన సమాచారం ప్రకారం అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలు పొందారు. చర్ల మండలంలోని పెద్దపల్లి కొంపల్లి, పులిగుండాల కత్తి గూడెం పూసుకుప్ప గోమ్మగూడెం పంచాయతీ లలో కాం గ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా కొండపల్లి తి ప్పాపురం పంచాయతీల్లో సిపిఐ అభ్యర్థు లు కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందారు.
అదేవిధంగా చర్ల మండలంలో తేగడ పెద్ద మెడి సి లేరు కుదునూరు ఉప్పరగూడెం కొత్తపల్లి పంచాయతీలలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే దుమ్మగూడెం మండల పరిధిలో 37 గ్రామపంచాయతీలు ఉండగా అందులో బట్టుగూడెం మొలకపాడు రామచంద్రుని పేట సుబ్బారావు పేట నారాయణ రావుపేట పెద్ద నల్లబెల్లి చిన్న నల్లబల్లి గుర్రాలబైలు గంగోలు ఎర్ర బోరు దబ్బ నూతల కమలాపురం కొత్తూరు కాశీనగరం రేగుపల్లి కొత్త దంతెనం నర్సాపురం పాతదంతనం పై డిగూడెం తూరుబాక బండారి గూడెం నరసాపురం గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షమైన సిపిఐ మద్దతు తో గెలుపొందింది.
దుమ్ముగూడెం మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ లక్ష్మీనగరం చింత గుప్ప బండి రేవు పంచాయితీలను గెలుపొందింది. అలాగే భద్రాచలంలో ఉన్న ఏకైక గ్రా మపంచాయతీ ఓట్ల లెక్కింపు గురువారం సాయంత్రం 6:30 కు ప్రారంభమైంది. అర్ధరాత్రికి గాని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేశారు
భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు
భద్రాచలం నియోజవర్గంలోని చర్ల దుమ్ముగూడెం భద్రాచలం ప్రాంతాలలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకా లకు ఆకర్షితులై తమ అభ్యర్థులను పెద్ద ఎత్తున భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు తెలిపారు.ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినందున రెట్టింపు ఉత్సా హంతో భద్రాచలం నియోజకవర్గం ను అభివృద్ధి కి కృషి చేస్తానని ఆయన తెలిపారు.