calender_icon.png 12 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మక్కల పైసలు ఇంకెప్పుడు ఇస్తరు?

12-12-2025 12:26:19 AM

బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జునరెడ్డి

సిద్దిపేట/హుస్నాబాద్, డిసెంబర్ 11(విజయక్రాంతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మక్కలను విక్రయించిన రైతులకు నెలన్నర గడిచినా డబ్బులు చెల్లించకపోవడంపై బీఆర్‌ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మక్కల పైసలు ఇంకెప్పుడు ఇస్తరు?‘ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం హుస్నాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకుంటే, ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే రైతుల అవసరాలు ఎలా తీరుతాయని అడిగారు.

నెలన్నర క్రితం తుపానుతో వరి, పత్తి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, మిగిలిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అధికారులు అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

కొనుగోలు కేంద్రాలలో పంటను అమ్ముకుంటే సరైన గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొందని, నెలలు గడిచినా రైతులకు డబ్బులు రావడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు డబ్బులు చెల్లించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, నాయకులు కన్నోజు రామకృష్ణ, బొజ్జ హరీశ్, భూక్య లక్ష్మనాయక్,  ప్రవీణ్, రాజు, వికాస్ తదితరులు పాల్గొన్నారు.