23 July, 2026 | 12:51 AM

8న సీడబ్ల్యూసీ సమావేశం

07-06-2024 12:36 AM

ఎన్నికల ఫలితాలపై పోస్ట్‌మార్టం

న్యూఢిల్లీ, జూన్ 6: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఈ నెల 8న ఢిల్లీలో జరుగనున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఇందులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన తీర్పుపై చర్చించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 11 గంట లకు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ప్రారంభం కానున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువగా 52 సీట్లే గెలుచుకోగా, ఈసారి కాస్త మెరుగుపడి 99 స్థానాలకు చేరింది. ఆ పార్టీ అనుకున్నట్టుగా భారీ విజయం సాధించలేకపో యింది. దీనిపై పార్టీ అగ్ర నేతలు పోస్ట్ మార్టం చేయనున్నట్టు తెలిసింది. మరోవైపు కూటమిలోకి ఇతర పార్టీలను చేర్చుకోవ టం, ఇప్పటికే ఉన్న పార్టీలు ఎన్డీయేవైపు వెళ్లకుండా చూడటంపై సమావేశంలో చర్చించారు. 2014 నుంచి లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో ౧౦ శాతం సభ్యులు ఉండాలి.