22 July, 2026 | 11:56 PM

వీకే పాండియన్ మిస్సింగ్

07-06-2024 12:39 AM

బీజేడీ ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి

భువనేశ్వర్, జూన్ 6: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడు.. రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారిన మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బీజేడీ) ఓడిపోయిన వెంటనే ఆయన అజ్ఞతంలోకి వెళ్లిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఎన్నికల ఫలితాల ముందు వరకు నవీన్ పట్నాయక్‌ను అనుక్షణం పండియన్ అంటిపెట్టుకొనే ఉండేవారు. అధికారిక, అనధికారిక సమావేశాలు అన్న తేడా లేకుండా పట్నాయక్‌కు నీడలా మెలిగేవారు. కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన నవీన్ పట్నాయక్ వెంట కనిపించటం మానేశారు. ఎక్కడా బహిరం గంగా కనిపించటంలేదు. నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నవీన్ పట్నాయక్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఆయన వెంట పాండియన్ లేరు. ఆ తర్వాత బీజేడీ నేతలతో పట్నాయక్ రెండు సమావేశాలు నిర్వహించారు.