calender_icon.png 15 December, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్లపై మేయర్‌తో మంతనాలు

15-12-2025 01:37:51 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ డివిజన్ల(GHMC Divisions) పునర్విభజనపై మేయర్ విజయలక్ష్మితో(Mayor Gadwal Vijayalakshmi) కాంగ్రెస్ కార్పొరేటర్లు చర్చించారు. జీహెచ్ఎంసీ మేయర్ తో కాంగ్రెస్ కార్పొరేటర్లు(Congress corporators), ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్ పై తమ అభ్యంతరాలను మేయర్ విజయలక్ష్మికి వినతిపత్రం ద్వారా తెలియజేశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రాన్ని మేయర్ కు ఇచ్చామని నేతలు తెలిపారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజన ముసాయిదాపై బీఆర్ఎస్ నేతలు(BRS leaders) జీహెచ్ఎంసీ కమిషనర్ కు అభ్యంతరాలు తెలుపనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు కమిషనర్ ను కలవనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మొత్తం 13 డివిజన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డివిజన్ల విభజన విధానంపై ఉన్న పలు అభ్యంతరాలను తెలియజేస్తూ చిన్నమైల్ అంజి రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌.వి. కర్ణన్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.