15-12-2025 01:11:15 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) సోమవారం నాడు సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ చంద్రబాబకు స్వాగతం పలికారు. కన్హా శాంతి వనంలో చంద్రబాబు, దాజీ మధ్య ప్రత్యేక భేటీ జరిగింది. కన్హా శాంతివనంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై దాజీ బాబుకు వివరించారు. ఏపీలో హార్ట్ ఫుల్ నెస్ కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు, దాజీ చర్చించారు.