16-07-2025 01:08:56 AM
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
నల్లగొండ టౌన్ జూలై 15 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ అని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. బిజెపి మతతత్వ పార్టీ అని మైనార్టీలపై దాడులు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొడుతుందని ఆరోపించారు. నల్లగొండ పట్టణంలోని దర్గా ఘాట్ రోడ్డుపై రాజకీయాలు చేయవద్దని సూచించారు. అందులో భాగంగానే సీనియర్ కాంగ్రెస్ నేత అయిన డాక్టర్ హఫీజ్ ఖాన్ కు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రత్యేక ఆహ్వానితులు మహమ్మద్ ఇంతియాజ్ హుస్సేన్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమద్, ఇంతియాజ్ అలీ, ఆమేర్, ఇబ్రహీం, టీఎస్ మేసా అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్, అజ్జు, మహమ్మద్ షరీఫ్, బురాన్ షరీఫ్, హైమద్, ఎంఏ ఖయ్యూం బాబా, శ్రీనివాస్, భాస్కర్, కిన్నెర అంజి, పోలే జయకుమార్, గాలి నాగరాజు,గాలి రవి, పెరిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.