calender_icon.png 16 July, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై కోర్టుల్లో కేవియట్ దాఖలు చేయాలి

16-07-2025 01:08:20 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు,  హైకోర్టులలో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యు డు ఆర్.కృష్ణయ్య అన్నారు. దీని వల్ల రిజర్వేషన్లపై ఎవరైనా న్యాయస్థానంలో ఫిటీషన్ వేసినా చెల్లవని ఆయన తెలిపారు.

రిజర్వేషన్ల పై ఆర్డినెన్స్ జారీ చేసిన తరువాత ఏదైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే, దానిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి హైకోర్టు బీసీ న్యాయవాదులు సిద్ధంగా ఉం డాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాం డ్స్‌లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజ ర్వేషన్లు ఆర్డినెన్స్ అమలుపై న్యాయ పరమైన అంశాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, హైకోర్టు మాజీ ఏజిపి జక్కుల వంశీకృష్ణ అధ్యక్షతన న్యాయ నిపునులు,  బీసీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ 42 శాతం బిసి రిజర్వేషన్లపై జీవో జారీ చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. రాజ్యాంగ లోని 9 వ షెడ్యూల్ లో రిజర్వేషన్లను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

దేశంలో నిశ్శబ్ద ఉద్యమంలాగా బిసి ఉద్యమం సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా జన గణనలో కుల గణన చేపట్టనుండటం చరిత్రాత్మక నిర్ణయం అని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్,  పగిళ్ల సతీష్, రాందేవ్ మోదీ, మణికంఠ, కృష్ణ యాదవ్, నరసింహ గౌడ్, న్యా యవాదులు రమేష్ బాబు, శ్రీనివాస్ యాదవ్, అశోక్ కుమార్, దేవేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.