3 April, 2026 | 3:29 AM

యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలించాలి

03-05-2024 12:26 AM

జిల్లా రిటర్నింగ్ అధికారి రాహుల్‌రాజ్

మెదక్, మే 2 (విజయక్రాంతి) : ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయిన వాటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చాలని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటితో రాజకీయ పార్టీ ల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీర్ మాధవ్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వాహణకు సంబంధించి కంట్రో ల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు 25 శాతం, వీవీ ప్యాట్లు 40శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి ర్యాండమైజేషన్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా జనరేట్ చేసిన జాబితాను అందజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ రెండో దఫాలో ప్రిసై డింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ జరుగుతున్నదని, మూడో ర్యాండమైజేషన్‌లో ఆయా యూనిట్లను పోలింగ్ కేంద్రాల కు తరలించడానికి సిద్ధం చేస్తామని అన్నా రు. పోలింగ్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచిం చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.