calender_icon.png 23 July, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి..

22-07-2025 10:53:03 PM

- కాంగ్రెస్ పార్టీలోకి టిఆర్ఎస్ నాయకుల భారీ చేరికలు..

- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేసి క్లీన్ స్విఫ్ చేసి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Raj Gopal Reddy) చేసే అభివృద్ధి కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి నాంపల్లి మండలం జాన్ తండాకు చెందిన 50 మంది బీఆర్ఎస్ శ్రేణులు మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి, వినూత్న కార్యక్రమాలు చూసి ఆకర్షితులమై మీతో కలిసి నడవాలని నిర్ణయించుకొని పార్టీలోకి వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ సర్పంచులు రవి నాయక్, జమ్లా నాయక్, మలిగిరెడ్డి చంద్రారెడ్డిలు మరియు నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి  ఉన్నారు.