25-06-2025 01:15:29 AM
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
తుంగతుర్తి, జూన్ 24 : తెలంగాణ ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి మాట్లాడారు.
నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనకు తండ్రిలా అండగా నిలిచారని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటానని, తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తుంగతుర్తి అని, ఈ తుంగతుర్తి ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోనని, కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని,
ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. తదుపరి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఎమ్మెల్సీ పదవి వచ్చిన దయాకర్కు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేస్తామన్నారు.
అనంతరం దామోదర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి వెంట ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, నాయకులు గుడిపాటి నర్సయ్య, దొంగరి గోవర్ధన్, కొండ రాజు, పెండెం రామ్మూర్తి, రామడుగు నవీన్ చారి, అనిల్ క్యాస్ట్రో, టైగర్ వెంకన్న, ప్రభు తదితరులు ఉన్నారు.